- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rashmika Mandanna : ఆ విషయం అందరికీ తెలుసు.. పెళ్లి అతడితోనే అంటూ హింట్ ఇచ్చేసిన రష్మిక
దిశ, వెబ్ డెస్క్ : హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), హీరోయిన్ రష్మిక మందన్న( Rashmika Mandanna) గురించి ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారంటూ ఇలా రక రకాల వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలు సార్లు ఔటింగ్స్, వెకేషన్స్ కు వెళ్లగా అక్కడ ఫొటోలు లీక్ అయ్యాయి. రీసెంట్ గా వీరిద్దరూ కలిసి బయట ఓ రెస్టారెంట్ లో ఫుడ్ తింటున్న ఓ ఫోటో బాగా వైరల్ అయింది.
ఆదివారం రాత్రి చెన్నైలో జరిగిన పుష్ప 2( Pushpa 2) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మూవీ టీమ్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో యాంకర్ , రష్మికను ఇలా అడిగింది.. మీరు సినీ ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా లేక బయటి వాళ్ళని చేసుకుంటారా అడగగా .. అప్పుడు నేషనల్ క్రష్ .. " దానికి సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ విషయం అందరికి తెలుసు కదా అంటూ స్వీట్ " గా చెప్పింది. ఇలా చెప్పగా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పుడు యాంకర్ అందరికి తెలుసు కానీ, నాకు తెలీదు చెప్పండి అని అడుగుతుంది.. నీకు అయితే పర్సనల్ గా చెప్తా అంటూ నవ్వుకుంటూ చెప్పింది. ఈ సారి డైరెక్ట్ గా చెప్పేదేంటని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.