అద్దాన్ని తలపిస్తున్న స్నెయిల్ ఫిష్.. ఒంటిపై మచ్చలతో అరుదైన రకం

by Nagaya |
అద్దాన్ని తలపిస్తున్న స్నెయిల్ ఫిష్.. ఒంటిపై మచ్చలతో అరుదైన రకం
X

దిశ, ఫీచర్స్ : సముద్రగర్భం వేలాది సంఖ్యలో అంతుచిక్కని రహస్య జీవులకు స్థావరమని తెలిసిందే. లోతైన సముద్ర జలాల్లో సంచరించే అనేక జీవులు అరుదుగా బయటపడుతుంటాయి. ప్రత్యేకంగా విభిన్న ఆకారాలు, లక్షణాలు గల చేపలు ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అలాంటి రకానికి చెందిన మరొక ఫిష్ నెటిజన్లను అబ్బురపరుస్తోంది.

అలస్కాన్ జలాల్లో కనిపించే అరుదైన 'ట్రాన్స్‌పరెంట్ ఫిష్' వింత ఆకారంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 'బ్లాచ్డ్ స్నెయిల్ ఫిష్‌'గా పేరొందిన ఈ వింత చేపను నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(NOAA) ఫిష్ బయోలజిస్ట్ సారా ఫ్రైడ్‌మాన్ కనుగొన్నారు. ఆయన దీని గురించి వివరిస్తూ.. 'ప్రతి ఏటా అలస్కాలోని అలూటియన్ దీవుల్లో NOAA నిర్వహించే సర్వేలో అరుదైన ఫిష్ జాతులను గుర్తిస్తాం. ఈ చేప జాతులు సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 100 నుంచి 200 మీటర్ల దిగువన కనిపిస్తాయి' అంటూ పేర్కొన్నారు.

బ్లాచ్డ్ ఫిష్ లక్షణాలు

ఎర్రటి మచ్చల శరీరాన్ని కలిగి ఉండే ఈ చేపలు నీటి గుండా వెళ్లే కాంతి తరంగదైర్ఘ్యాలకు అనుగుణంగా జీవించేందుకు అలవాటు పడతాయి. రెడ్ లైట్‌కు తక్కువ వేవ్‌ లెంగ్త్ ఉన్నందున లోతైన చీకటిలోకి చేరుకోదు. అందువల్ల సముద్రంలో ఉండే లోతైన మాంసాహార జంతువులకు ఇవి కనిపించవు. వాటి శరీరం కింది భాగాన ఉండే చూషణ కప్పులు నీటి ప్రవాహాల్లో రాళ్లను గట్టిగా పట్టుకుని ఉండటంలో సాయపడతాయి.


Advertisement

Next Story