సీఎం కేసీఆర్ నిర్ణయంతో వారికి మతిపోయింది: రాంబాబు యాదవ్

by Satheesh |
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వారికి మతిపోయింది: రాంబాబు యాదవ్
X

దిశ, ముషీరాబాద్: సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీపై చేసిన ప్రకటనతో ప్రతిపక్ష పార్టీ నాయకులకు మతి పోయిందని టీఆర్ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు యాదవ్ అన్నారు. బాగ్ లింగంపల్లి టీఆర్ఎస్‌కేవీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్‌కేవీ నాయకులు దానకర్ణాచారి, శివ శంకర్, మారుతి, బాలకృష్ణ, వెంకటేశ్, మురుతి, ప్రకాశ్, గడ్డం శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story