కండోమ్ గురించి మాట్లాడటానికి సిగ్గెందుకు.. రకుల్ ప్రీత్‌సింగ్

by Harish |
కండోమ్ గురించి మాట్లాడటానికి సిగ్గెందుకు.. రకుల్ ప్రీత్‌సింగ్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ప్రస్తుతం 'ఛత్రివాలి' చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ మూవీలో సరికొత్త పాత్ర కండోమ్ టెస్టర్‌గా ఆమె కనిపించనుండగా.. తాజాగా ఆ క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. 'ఇది కొత్త విషయమేమి కాదు. గత కొన్నేళ్లుగా సమాజంలో ఉన్నదే. ప్రస్తుతం తెరకెక్కించే ఈ కథ అందరికీ నచ్చుతుంది. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అమ్మాయి కండోమ్ టెస్టర్ క్వాలిటీ హెడ్‌గా ఎలా మారిందో చూపించే కథ. మొదట డబ్బు కోసమే ఉద్యోగం చేసినా.. తర్వాత పనిలో ప్రాముఖ్యత తెలుసుకుంటుంది' అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే అమ్మ కడుపులోనుంచి ఎలా పుడతామో తెలిసినప్పుడు దాని గురించి మాట్లాడడానికి సిగ్గెందుకు అని ప్రశ్నించిన రకుల్.. ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్ పరంగా కొంచెం ఇబ్బందే. కానీ, తన పేరెంట్స్ మరో ఆలోచన లేకుండా ఈ క్యారెక్టర్ చేయమని ఎంకరేజ్ చేశారంటూ వివరించింది.

Advertisement

Next Story

Most Viewed