ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ స్ట్రగుల్.. అంచనాలు అందుకోకపోతే అంతే సంగతి..

by Harish |
ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ స్ట్రగుల్.. అంచనాలు అందుకోకపోతే అంతే సంగతి..
X

దిశ, సినిమా: బెంగాలీ బ్యూటీ రైమాసేన్ సినీ పరిశ్రమలో స్టార్ కిడ్స్ ఎదుర్కొంటున్న ప్రెజర్ గురించి మాట్లాడింది. తల్లి, ప్రముఖ నటి మూన్‌సేన్ వారసత్వంతోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. సోదరి రియా‌సేన్ చెల్లెలిగానే పాపులారిటీ సాధించింది. ఈ మేరకు రీసెంట్‌గా మీడియాతో మాట్లాడుతూ నట వారసులపై భారీ అంచనాలుంటాయని, వాటిని అందుకోవడం కోసం తమ ఆనందాన్ని వదిలేసి సక్సెస్ వచ్చేంత వరకూ స్ట్రగుల్ అవుతుంటారని పేర్కొంది. 'నేను స్టార్ కిడ్ కావడంతో ప్రజలు నా నుంచి ఎక్కువగా ఆశించారు. అంచనాలు అందుకోలేకపోతే విమర్శించారు. 'చోఖర్ బాలీ' నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. దీంతో ఆదరించడం ప్రారంభించారు. వారసులకు స్టార్టింగ్‌లో కష్టాలు తప్పవు' అంటూ తన అనుభవాలను పంచుకుంది. ఇక తన అమ్మమ్మ సుచిత్రా సేన్ అందించిన గొప్ప వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎన్ని కష్టాలైన ఎదుర్కొంటానన్న రైమా.. ఎల్లప్పుడూ పెద్దలు, ప్రేక్షకుల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.


Advertisement

Next Story