- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
RAHASYAM IDHAM JAGATH: కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.. ‘రహస్యం ఇదం జగత్’ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్
దిశ, సినిమా: రాకేష్ గలేబి (Rakesh Galebi), స్రవంతి పత్తిపాటి (Sravanti Pattipati), మానస వీణ (Manasa Veena), భార్గవ్ గోపీనాథం (Bhargav Gopinath) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘రహస్యం ఇదం జగత్’ (RAHASYAM IDHAM JAGATH). సైన్స్ ఫిక్షన్ (Science Fiction) అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్ (Mythological Thrillers)గా రూపొందుతున్న చిత్రంలో నేటి తరం ప్రేక్షకులను అలరించే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, మన పురాణాలు, ఇతిహాసాల గురించి... శ్రీచక్రం గురించి ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ (Komal R Bharadwaj) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. ఇక నవంబరు 8న ‘రహస్యం ఇదం జగత్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
‘నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఆసక్తి. మా నాన్న స్టేజీ షోలకు రైటర్ (Writer). అమ్మ కూడా కవితలు రాస్తుండేవారు. మా ఇంటి వాతావరణం నుంచే నాకు సినిమాలపై ఆస్తక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచే నేను డైరెక్టర్ అవుతానని ఇంట్లో చెప్పేవాడిని. దర్శకుడిగా ఒక వైవిధ్యమైన కొత్త కథలో రావాలని అనుకున్నాను. ఆ సమయంలోనే ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇండియాకు చెందిన శ్రీ చక్రం గురించి అమెరికాలో అన్వేషణ జరిగింది. శ్రీ చక్రం గురించి తవ్వకాలు జరిగిన ప్రదేశం నేను ఉండే ప్లేస్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. శ్రీ చక్రం కోసం జరిగిన అన్వేషణ నన్ను బాగా ఇన్‌స్పయిర్ చేసింది. ఈ కథను ఇంట్రెస్టింగ్ చెప్పొచ్చు అనిపించింది. మన కథను, మన పురాణాల కథను తీసుకుని ఫిక్షన్‌ను యాడ్ చేసి లార్జన్‌దేన్ లైఫ్ కథ చెప్పాలి అనుకోని చెప్పాను. వామ్ హోల్ కాన్సెప్ట్‌తో ఇతర లోకాలకు ట్రావెల్ కావొచ్చు. సైన్స్ (Science) ప్రకారం వామ్‌హోల్స్‌తో ట్రావెల్ (travel) చేస్తే ఇంకో టైమ్‌లోకి వెళతాం అని చెప్పే కథ ఇది. ఈ కథలో ఆడియన్స్ (Audience) బాగా థ్రిల్‌గా ఫీలయ్యే అంశాలు చాలా ఉన్నాయి. మన కథలు, మన పురాణాలు గురించి మన పూర్వీకులు గురించి ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. సైన్స్, వామ్‌హోల్స్ గురించి ముందే పురాణాల్లో రాశారు. ఈ సినిమా చూసిన వాళ్లు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌ను పొందుతారు. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని కథ ఇది’ అని ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.