accident : బైక్​ను ఢీకొట్టిన బొలెరో వాహనం...ఇద్దరు మృతి

by Sridhar Babu |
accident : బైక్​ను ఢీకొట్టిన బొలెరో వాహనం...ఇద్దరు మృతి
X

దిశ, రామడుగు : రామడుగు మండలం షానగర్ గ్రామ సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు రామడుగు మండల కేంద్రం నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం షానగర్ శివారు ప్రాంతంలో కరీంనగర్ నుంచి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను ఢీ కొట్టింది. దాంతో బైక్​పై ఉన్న సామంతుల శివాజీ, నీలం అరుణ్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరూ రామడు మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story