America: అమెరికాతో సత్సంబంధాలకు ఢోకా ఉండదు

by Mahesh Kanagandla |
America: అమెరికాతో సత్సంబంధాలకు ఢోకా ఉండదు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Presidential Elections)పై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar) స్పందించారు. ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు ఎవరు గెలిచినా ఆ దేశంతో భారత్ సంబంధాలు మరింత బలపడుతాయని వివరించారు. సుస్థిరంగా వృద్ధి చెందుతాయని తెలిపారు. ఆస్ట్రేలియా(Australia) విదేశాంగ మంత్రి పెన్ని వోంగ్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గత రెండు దశాబ్దాలుగా అమెరికా, భారత్ సంబంధాలు బలోపేతమయ్యాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ ఇలాగే ఉన్నది. కాబట్టి, అమెరికా ప్రజల తీర్పు ఏదైనా అమెరికాతో భారత్ సంబంధాలు మరింత సదృఢమవుతాయి’ అని వివరించారు. ఇక క్వాడ్ విషయానికి వస్తే.. ‘ట్రంప్ హయాంలోనే క్వాడ్ కూటమి రూపుదాల్చంది. కొవిడ్ కాలంలో అందరూ వర్చువల్ మీటింగ్‌లు చేపడుతుండగా 2020 టోక్యోలో విదేశాంగ మంత్రులు ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. క్వాడ్ భవిష్యత్ గురించి ఈ కమిట్‌మెంట్ తెలుపుతుంది’ అని జైశంకర్ చెప్పారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి కూడా అమెరికా ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా సత్సంబంధాలు కొనసాగుతాయని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed