- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరి దిగుబడిలో తెలంగాణ రికార్డ్ : మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రావు
దిశ, తెలంగాణ బ్యూరో : వరి దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించబోతుందని,150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి అవకాశం ఉందని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు స్పష్టం చేశారు. యావత్ భారత దేశంలోనే రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిన సందర్భం ముందెన్నడూ లేదని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లతో పాటు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. 60.80 లక్షల ఎకరాలలో ప్రభుత్వం అంచనా వేస్తున్న దిగుబడిలో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. అందులో 47 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలుగా, 44 లక్షలు దొడ్డు రకం ఉంటాయన్నారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు బోనస్ గా క్వింటాకు 500 ప్రకటించిన నేపథ్యంలో రైతులు సాగు వైపు మొగ్గు చూపారన్నారు. దిగుబడిలో సన్నాలు 47 లక్షల అంచనాయే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ మొత్తం కొనుగోలుకు గాను 30 వేల కోట్లు అవుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 20 వేల కోట్లు విడుదల చేసిందని, పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు అదనంగా నిధులు విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కాగా ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదే సమయంలో రైతులు అయోమయంలో పడకుండా ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతాంగంలో అవగాహన కలిపించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. కొనుగోలులో ఎక్కడా రాజీ పడేది లేదని ముమ్మాటికీ ఇది రైతు పక్ష పాత ప్రభుత్వమని రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. అత్యధికంగా రికార్డ్ స్థాయిలో పంట దిగుబడి రాగా, ధాన్యం కొనుగోలు అనేది ప్రభుత్వానికి పరీక్షా కాలం అని ఇందులో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభుత్వానికి ఎక్కడ కూడా అప్రతిష్ట రాకుండా చూడాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 7,572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ బియ్యానికి బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో డిమాండ్ ఉందన్నారు. ధాన్యం కొనుగోలులో తాలు, తరుగుదల లేకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రకృతి విపత్తులతో అవాంతరాలు సంభవించిన పక్షంలో అధిగమించేందుకు అధికారులనూ సన్నద్ధం చేయాలని పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ ను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి తోడ్పాటనందించాలని సూచించారు. సీఎంఆర్ బియ్యం మిల్లింగ్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సన్నాలకు 10 నుండి 50 రూపాయలకు, దొడ్డు రకానికి 10 నుండి 40 రూపాయలకు పెంచామన్నారు. నిబంధనల మేరకే బ్యాంక్ గ్యారెంటీ పెట్టామని స్పష్టం చేశారు. అంతేగాకుండా కేవలం 10 నెలల వ్యవధిలోనే 11,537.40 కోట్ల రుణాభారాన్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు.
- Tags
- Telangana: