Tapas : పెండింగ్ బిల్లులు తక్షణమే మంజూరు చేయాలి

by Sridhar Babu |
Tapas : పెండింగ్ బిల్లులు తక్షణమే మంజూరు చేయాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : పెండింగ్ బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నెల రోజుల పాటు ధర్మగ్రహ దీక్ష ఉద్యమంలో భాగంగా మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ కు వినతిపత్రం సమర్పించారు. తపస్ రాష్ట్ర కార్యదర్శి గడప నవీన్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించినప్పటికీ ఆ దిశగా చర్యలు లేవని, ఒకటో తారీకున జీతం తప్ప మిగిలిన ఎటువంటి ఆర్థిక సంబంధిత సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినప్పటికీ రావలసిన 5 డీఏ లలో కేవలం ఒక్కటి మాత్రమే మంజూరు చేశారని విమర్శించారు. తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, రాజ్ కుమార్​ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఆర్థిక సమస్యల పరిష్కారం వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యదర్శి గడప నవీన్, జిల్లా అధ్యక్షులు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కోశాధికారి రమాదేవి, సురేందర్ , గోపాల్, రమేష్ రాథోడ్, వెంకటేష్ ,సంగమేశ్, శ్రీనివాస్, వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement

Next Story