- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎయిర్ క్వాలిటీపై పీసీబీ ఫోకస్.. అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచన
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గాలి కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గాలి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఎయిర్ క్వాలిటీ రెగ్యులేటింగ్‌పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పీసీబీ, పర్యావరణ శాఖ, రోడ్డు భవనాల శాఖ, పురపాలక, పట్టణాభివ్రద్ధి శాఖ అధికారులతో పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిర్ క్వాలిటీ పెంచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ సందర్బంగా ఆయా శాఖల అధికారులు ఎయిర్ క్వాలిటీ గురించి మంత్రికి వివరించారు. పటానుచెరు, నల్గొండ ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల కారణంగా ఎయిర్ క్వాలిటీ పూర్తిగా పడిపోయిందని అధికారులు వివరించారు.
తాండూరు, పరిగి ప్రాంతాల్లో మైనింగ్ కారణంగా ఎయిర్ క్వాలిటీ పూర్తిగా దెబ్బ తిన్నదని వివరించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ పెంచడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన చర్యలు, కార్యక్రమాల గురించి అధ్యయనం చేయాలని పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి గగోలోత్‌కి మంత్రి కొండా సురేఖ సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేయడంతోపాటు ఎయిర్ క్వాలిటీ పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ప్రజారోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షించడానికి పీసీబీ చర్యలు తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.