Sharda Sinha : ‘బిహార్‌ కోకిల’ అస్తమయం.. జానపద గాయని శారదా సిన్హా తుదిశ్వాస

by Hajipasha |   ( Updated:2024-11-05 18:00:40.0  )
Sharda Sinha : ‘బిహార్‌ కోకిల’ అస్తమయం.. జానపద గాయని శారదా సిన్హా తుదిశ్వాస
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘బిహార్‌ కోకిల’గా ఖ్యాతి గడించిన ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా(72) ఇక లేరు. ఆమె ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. భోజ్‌పురి, మైథిలి, మాగాహి భాషల్లో పాటలు పాడి శారదా సిన్హా(Sharda Sinha) ఉత్తరాది రాష్ట్రాల సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. 2018 సంవత్సరం నుంచి మైలోమా(Myeloma) అనే బ్లడ్ క్యాన్సర్‌తో ఆమె పోరాడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో రెండు వారాల క్రితం శారదను ఢిల్లీ ఎయిమ్స్‌లోని అంకాలజీ విభాగంలో చేర్పించారు.

సోమవారం రోజు ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతినడంతో.. వైద్యులు వెంటిలేటర్ సపోర్టుపై చికిత్సను అందించారు. శారదా సిన్హా ఇక లేరనే విషాద వార్తను ఆమె కుమారుడు అంశుమన్ సిన్హా.. శారదా సిన్హా ఫేస్‌బుక్ అధికారిక పేజీ వేదికగా ప్రకటించారు. ‘‘భౌతికంగా మా అమ్మ ఇక మాతో లేదు’’ అని ఆయన ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. కాగా, శారదా సిన్హా 2018లో పద్మభూషణ్(Padma Bhushan) అవార్డును అందుకున్నారు.

Advertisement

Next Story