- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Saudi : Saudi : సౌదీలో మంచు దుప్పటి.. ఎడారులను కప్పేసిన మంచు

X
దిశ, నేషనల్ బ్యూరో : సౌదీ అరేబియా(Saudi).. అనగానే మనకు ఎడారులు గుర్తుకొస్తాయి. ఎడారుల మధ్య నుంచి సాగే నిశ్శబ్ద రోడ్ల వీడియోలను మనలో చాలామంది యూట్యూబ్‌లో చూసే ఉంటారు. అయితే సౌదీలోని అల్-జౌఫ్ (Al Jawf) ప్రావిన్స్ పరిధిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత వారం రోజులుగా అక్కడ ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. చలికాలం(Winter) కావడంతో ఈ ప్రావిన్స్ పరిధిలోని కొండ ప్రాంతాలు, ఎడారులను మంచుదుప్పటి కప్పేసింది.
ఇప్పుడు ఇక్కడి ఎడారుల మధ్యనున్న రోడ్ల మీదుగా రాకపోకలు సాగించేవారు ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. రాబోయే కొన్ని రోజుల్లో అల్-జౌఫ్ ప్రావిన్స్ పరిధిలో పిడుగుపాటు, బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సౌదీ వాతావరణ విభాగం అలర్ట్ జారీ చేసింది. మక్కా, జాజన్, ఆసిర్ ప్రాంతాల ప్రజలను కూడా ఇదే సమాచారంతో అప్రమత్తం చేసింది.
Next Story