- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Maharashtra:25 లక్షల ఉద్యోగాలిస్తాం.. మహాయుతి మేనిఫెస్టో విడుదల
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర(Maharashtra)లో శివసేన-బీజేపీ-ఎన్సీపీ పార్టీల మహాయుతి కూటమి(Mahayuti Alliance) మంగళవారం మేనిఫెస్టో రిలీజ్ చేసింది. నవంబర్ 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. సీఎం ఏక్ నాథ్ షిండే అలయెన్స్ మేనిఫెస్టోను కొల్హాపూర్ నార్త్ జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీష్, అజిత్ పవార్‌లతో కలిసి కూటమికి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టోల 10 గ్యారంటీలను కూటమి చేర్చింది. ఇందులో మహిళలకు అందుతున్న ఆర్థిక చేయూతను రూ.1500 నుంచి రూ.2,100కు పెంచనున్నట్లు తెలిపారు. 25వేల మంది మహిళలను పోలీసు శాఖలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. షెట్కారీ సమ్మాన్ యోజనలో భాగంగా ఆర్థిక సహాయాన్ని రూ.12వేల నుంచి రూ.15వేలకు పెంచనున్నట్లు ప్రకటించారు. మద్దతు ధరలో 20 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేశారు.
మేనిఫెస్టోలో చేర్చిన 10 హామీలు ఇవే..
- మహిళలకు నెలకు రూ.2,100 ఆర్థిక చేయూత
- రైతు పెట్టుబడి సహాయం కింద అందించే మొత్తాన్ని రూ.12వేల నుంచి రూ.15 వేలకు పెంచడం
- ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులకు భోజనం, ఆశ్రయం కల్పించడం
- రూ.1500 అందుతున్న పెన్షన్ సాయాన్ని రూ.2,100కు పెంచడం
- నిత్యావసర వస్తుల ధరలను స్థిరంగా ఉంచడం
- విద్యార్థులకు ప్రతి నెల ఆర్థిక సాయం అందించడం, 25లక్షల ఉద్యోగాల కల్పించడం. పరీక్షలు నిర్వహించి ప్రతిభ చాటిన 10 లక్షల మంది విద్యార్థులకు రూ.10వేల సాయం అందించడం
- 45వేల గ్రామాల్లో రహదారులు నిర్మించడం
- అంగన్ వాడీలు, ఆశా కార్యకర్తలకు వేతనాలను రూ.15వేలకు పెంచడం, వారికి ఆరోగ్య భీమా చేయించడం
- విద్యుత్ బిల్లులో 30 శాతం రాయితీ
- విజన్ మహారాష్ట్ర 2029లో భాగంగా 100 రోజుల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టడం.