Air India: ఎయిర్ఇండియాలో సమర్థులైన మేనేజర్‌లు లేరు: పి చిదంబరం

by S Gopi |
Air India: ఎయిర్ఇండియాలో సమర్థులైన మేనేజర్‌లు లేరు: పి చిదంబరం
X

దిశ, నేషనల్ బ్యూరో: టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం విమర్శలు చేశారు. మంగళవారం ఆయన ప్రయాణించాల్సిన ఢిల్లీ-చెన్నై విమానం ఆలస్యం కావడంతో ఆయన సంస్థ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధిచి ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన.. ఈ పరిస్థితి సంస్థ కొత్త యాజమాన్న్యం అసమర్థత అని, ఎయిర్ఇండియా నిర్వహణ ప్రభుత్వం నుంచి ప్రైవేట్ రంగానికి మారినప్పటి నుంచి ఆచరణలో ఎలాంటి మెరుగుదల లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే ప్రయాణీకులందరూ 15 నిమిషాల పాటు ఏరో బ్రిడ్జిపై నిలబడే ఉన్నారు. గేట్ వద్ద బోర్డింగ్ కోసం క్లియర్ చేసినప్పటికీ విమానం తలుపు వద్దే వేచి ఉండాల్సి వచ్చిందని చిదంబరం తెలిపారు. విమానం బయలుదేరే సమయానికి 10 నిమిషాల తర్వాత ప్రయాణీకులు ఎక్కుతున్నారు. విమానం ఎప్పుడు బయలుదేరుతారో ఎవరికీ తెలియదు. తాను తరచుగా ఎయిర్ఇండియాలో ప్రయాణం చేస్తాను. దీన్ని బట్టి ప్రస్తుతం సంస్థలోని వివిధ స్థాయిలలో సమర్థులైన మేనేజర్లు లేరని భావిస్తున్నానని పేర్కొన్నారు.

Advertisement

Next Story