Prayagraj Mahakumbh: ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు రైల్వే స్టేషన్‌లో ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు

by S Gopi |
Prayagraj Mahakumbh: ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు రైల్వే స్టేషన్‌లో ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే మహాకుంభమేలం కోసం దాదాపు 10 కోట్ల మంది ప్రజలు రైలులో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భద్రతను పెంచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని తొమ్మిది రైల్వే స్టేషన్‌లలో భద్రత నిమిత్తం ఫేస్ రికగ్నిషన్ కెమెరాల ఏర్పాటుతో సహా పలు చర్యలు తీసుకుంది. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ ప్రత్యేకంగా మహాకుంభమేలం కోసం రైల్వే స్టేషన్‌లలో సీసీటీవీతో పాటు ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించడంలో, సమస్యాత్మకంగా ఉండేవారిని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కుంభమేళాకు సుమారు 10 కోట్ల మంది రైలులో ప్రయాణించే అవకాశం ఉన్నందున, రైల్వే అధికారులు సమగ్ర భద్రతా చర్యలను అమలు చేస్తున్నట్టు ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ పీఆర్ఓ అమిత్ సింగ్ చెప్పారు. అన్ని రైల్వే స్టేషన్‌లలో సుమారు 650 సీసీటీవీ, 100 ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed