- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మళ్లీ మొదటికొచ్చిన అవినీతి కథ.. 3 రోజులే గడువు
దిశ, సిటీ బ్యూరో: ఒకవైపు తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, మరోవైపు జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ ను టార్గెట్ కు తగిన విధంగా వసూలు చేసుకునేందుకు గడువు దగ్గర పడుతుంది. వర్తమాన ఆర్థిక సంవత్సరం టార్గెట్ గా పెట్టుకున్న రూ. 1850 కోట్లలో ఇప్పటివరకు అన్ని సర్కిళ్లలో కలిపి రూ. 1450 కోట్ల వరకు పన్నును వసూలు చేశారు. కానీ గత ఆర్థిక సంవత్సరం ఇదే తేదీ కల్లా జరిగిన కలెక్షన్ తో గమనిస్తే రూ. 130 కోట్ల వరకు కలెక్షన్ వెనకబడి ఉన్నట్లు సమాచారం. టార్గెట్ గా పెట్టుకున్న రూ. 1850 కోట్ల కలెక్షన్ ను చేరుకునేందుకు రానున్న కేవలం మూడు రోజుల వ్యవధిలో రూ. 400 కోట్లను వసూలు చేయాల్సిందేనని అధికారులు క్షేత్ర స్థాయి ట్యాక్స్ కలెక్షన్ సిబ్బందికి టార్గెట్లు విధించారు. సీనియార్టీ, ఏరియా, వారికిచ్చిన డాకెట్లలోని ఆస్తుల విలువలను బట్టి రోజు వారీ టార్గెట్లు విధించారు. ఈ నెల చివరి రోజైన 31న ఎలాగో అన్ని రకాలుగా రూ. వంద కోట్ల వరకు ఆస్థి పన్ను వసూలయ్యే అవకాశాలుండటంతో మిగిలిన రూ. 300 కోట్లను రోజుకు రూ. వంద కోట్లుగా టార్గెట్ విధించారు. రానున్న మూడు నెలల పాటు టార్గెట్ కు తగిన విధంగా పన్ను వసూలు చేసుకునేందుకు వీలుగా ట్యాక్స్ సిబ్బందెవ్వరూ సెలవులు తీసుకోరాదని.. ఈ నెల 31 వరకు సర్కిల్ అధికారులకు, ప్రధాన కార్యాలయం అధికారులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈసారి కాస్త ముందుగానే టార్గెట్లు ఇచ్చినా, ఇంకా కలెక్షన్ లో వెనకబడిపోయి ఉన్న ట్యాక్స్ ఇన్స్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లంతా మార్చి 31 తర్వాత వసూలు కానున్న మొత్తం ఆస్థి పన్నును బట్టి, వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, ఇచ్చిన టార్గెట్ కన్నా తక్కువ కలెక్షన్ చేసినవారిని గుర్తించి అవసరమైతే ఇతర సర్కిళ్లకు బదిలీ చేయాలని భావిస్తున్నట్లు పలువురు ఉన్నతాధికారులు వెల్లడించారు.
బదిలీలైన పాత సర్కిళ్లలోనే విధులు
జీహెచ్ఎంసీలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్లు ఇచ్చిన తర్వాత రెండు నెలల క్రితం మొత్తం బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లను ఓ సర్కిల్ నుంచి మరో సర్కిల్ కు బదిలీ చేశారు. కొత్త ప్రాంతాలకు వెళ్లటంతో, అక్కడి సర్కిల్ అధికారలిచ్చిన డాకెట్ (ఆస్తుల జాబితా) ప్రకారం పన్ను వసూలు చేయలేక, అధికారులిచ్చిన టార్గెట్ల ప్రకారం వారు కలెక్షన్ చేయలేక బదిలీలకు ముందు వారు విధులు నిర్వర్తించిన సర్కిళ్లలోనే అక్కడి సిబ్బందిని మేనేజ్ చేసుకుని, పాత తేదీల్లో అసెస్ మెంట్లు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్వవహారాలు ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, మాదాపూర్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలీ, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ సర్కిళ్లలో జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తుస్సుమన్న సెల్ప్ అసెస్ మెంట్
ఆస్తి పన్ను మదింపు, స్వీకరణలో అక్రమాలు అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు ఆస్తులకు సంబంధించి స్వచ్ఛందంగా ఇంటి యజమానే ఆస్తి పన్ను చెల్లించేందుకు వీలుగా సెల్ఫ్ అసెస్ మెంట్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కానీ.. ఈ కార్యక్రమం ఏ మాత్రం ముందుకు జరగకపోవటంతో ఆస్తుల యజమానులు మళ్లీ ట్యాక్స్ సిబ్బందినే ఆశ్రయించటంతో అవినీతి కథ మొదటికొచ్చినట్టయింది.