Pro Kabaddi లీగ్ సీజన్-9 వేలానికి తేదీలు ఖరారు..

by Mahesh |   ( Updated:2022-07-22 14:06:13.0  )
Pro Kabaddi Season Auction to be held on Agust 5th and 6th
X

న్యూఢిల్లీ: Pro Kabaddi Season Auction to be held on Agust 5th and 6th| ఈ ఏడాది చివర్లో ప్రో కబడ్డీ లీగ్ సీజన్-9 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆటగాళ్లకు వేలం తేదీలను నిర్వాహకులు ప్రకటించారు. మషాల్ స్పోర్ట్స్, లీగ్ నిర్వాహకులు శుక్రవారం తేదీలను ఖరారు చేశారు. ఆగస్టు 5-6 తేదీల్లో ముంబైలో ప్రో కబడ్డీ లీగ్ సీజన్-9 వేలం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేలంలో దేశీయ, విదేశీ ఆటగాళ్లు పాల్గొననున్నారు. అయితే లీగ్ నిర్వాహకులు ప్లేయర్లను ఏ,బీ,సీ,డీ కేటగిరీల రూపంలో విభజించారు.

వీరి తర్వాత ఆల్ రౌండర్లు, డిఫెండర్స్, రైడర్లను తదుపరి కేటగిరీలో చేయనున్నారు. కేటగిరీ ఆధారంగా ప్లేయర్ల ధరను నిర్వాహకులు ఫిక్స్ చేశారు. ఏ కేటగిరీ ప్లేయర్లకు రూ.30 లక్షలు, బీ కేటగిరీ ఆటగాళ్లకు రూ.20 లక్షలు, సీ కేటగిరీ ప్లేయర్లకు రూ.10 లక్షలు, డీ కేటగిరీ ప్లేయర్లకు రూ.6 లక్షలు ఫిక్స్ చేశారు. అయితే సీజన్-9 లోని ప్రతి జట్టుకు వారి స్క్వాడ్ మెయింటెనెన్స్ కోసం రూ.4.4 కోట్లు చెల్లించనున్నారు. కాగా, ఈ సీజన్‌లో దాదాపు 500 ఆటగాళ్లు ఆడనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత అథ్లెట్‌..

Advertisement

Next Story