విద్యార్థికి సహాయం చేసిన ప్రిన్సిపాల్.. అరెస్ట్ చేసిన పోలీసులు..ఎందుకంటే..

by Javid Pasha |
విద్యార్థికి సహాయం చేసిన ప్రిన్సిపాల్.. అరెస్ట్ చేసిన పోలీసులు..ఎందుకంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి విద్యార్థి జీవితంలో గురువు పాత్ర ప్రముఖంగా ఉంటోంది. ఓ విద్యార్థి తన జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక అతడి గురువులు ఉంటారు. అందుకే గురువులు సైతం విద్యార్థి కష్టకాలంలో సహాయం చేసేందకు వెనకాడరు. కానీ హర్యానాలో మాత్రం ఓ ప్రిన్సిపాల్ విద్యార్థికి సహాయం చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ టీచర్ విద్యార్థిని తప్పుదోవలో నడిచేందుకు ప్రోత్సహించాడని పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యాలో ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ఈ ఘటన జరిగింది. అయితే తమ స్కూల్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థులకు చీటింగ్ చేయడంలో సహాయం చేసినందుకు పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు స్టాఫ్ మెంబర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి నుంచి కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు, ఫొటోస్టాట్ మిషన్లు వాటితో పాటు కొన్ని స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ మేరకు విషయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తమకు తెలిపిందని, వెంటనే కేసు నమోదు చేసి పాఠశాల ప్రిన్సిపాల్, స్టాఫర్లపై చర్చలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story