నడిరోడ్డుపై నటి జుట్టుపట్టి కొట్టిన హీరో భార్య.. ఎఫైర్ లేదన్నా వినకుండా

by Mahesh |
నడిరోడ్డుపై నటి జుట్టుపట్టి కొట్టిన హీరో భార్య.. ఎఫైర్ లేదన్నా వినకుండా
X

దిశ, సినిమా : ఒడియా హీరో బబూసన్‌ భార్య తృప్తి.. హీరోయిన్‌ ప్రకృతిపై దాడి చేసింది. తన భర్తతో అక్రమం సంబంధం పెట్టుకుందన్న కారణంతో కారులో వెళ్తున్న నటిని అడ్డుకుని నడిరోడ్డుపై జుట్టుపట్టి కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుండగా అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే ఈ ఇష్యూపై స్పందించిన ప్రకృతి.. 'మహిళల వాదనకు ఎక్కడా మద్దతు లభించడం లేదు. ప్రతీ విషయంలో మాదే తప్పని నిందిస్తున్న ఇలాంటి సమాజంలో బతుకుతుండటం దురదృష్టకరం. సహ నటుడు బబూసన్‌తో ఓ కార్యక్రమానికి వెళ్లి వచ్చాను. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న అతడి భార్య కొంతమందిని వెంటేసుకుని వచ్చి నాపై దాడి చేసింది. మానసికంగానూ హింసించింది. ఇది అస్సలు కరెక్ట్‌ కాదు. నేను మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నాను. ఈ క్రమంలోనే రియాలిటీలో వేధింపులకు గురవుతున్నాను. ఏదేమైనా మహిళా సాధికారతను సాధించడమే నా లక్ష్యం' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed