- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: హోంబలే ఫిలిమ్స్‌తో ప్రభాస్ మూడు సినిమాలు.. ఎన్ని కోట్ల డీల్ అంటే?
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం.. ‘రాజాసాబ్ (Rajasab), స్పిరిట్ (spirit), ఫౌజీ (Fauji)’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా.. ఇప్పటికే ‘రాజాసాబ్’ నుంచి వస్తున్న అప్‌డేట్స్ (Updates)తో ఫ్యాన్స్ (fans) ఖుష్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో హోంబలే ఫిలిమ్స్ (Hombale Films)తో మూడు ప్రాజెక్టులు ఓకే చేసి.. తన అభిమానులకు ఫుల్ కిక్ (full kick) ఇచ్చాడు ప్రభాస్. ఇందులో ఒకటి ‘సలార్-2’ (Salaar-2) కాగా.. మిగిలిన రెండు ప్రాజెక్టులు ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ‘సలార్-2’ షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు హోంబలే ఫిలిమ్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేంది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘సలార్’కు సీక్వెల్ (sequel)గా ‘సలార్-2’ వస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ‘భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో మూడు చిత్రాల భాగస్వామ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయడం మాకు గర్వకారణం’ అంటూ హోంబలే ఫిలిమ్స్ తాజాగా అనౌన్స్ (announce) చేసిన విషయం తెలిసిందే. అయితే.. డీల్ ఎంత అనేది తెలియరాలేదు. ఇక ఇండస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం మేరకు.. ప్రభాస్ తన మూడు సినిమాలు హోంబలే ఫిలిమ్స్‌తో తీసేందుకు ₹575 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ట్వీట్ (tweet) వైరల్ కావడంతో.. ‘మూడు ఓపినింగ్స్ (Openings)తోనే తిరిగి ఇచ్చేస్తాడులే’ అని ‘ఇండియా సూపర్‌స్టార్ (Indian Superstar).. ఆ మాత్రం ఉంటుందిగా’ అంటూ కామెంట్స్ (comments) పెడుతున్నారు ఫ్యాన్స్.