- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas : ప్రభాస్‌ను ప్రేమించి ఘోరంగా మోసపోయిన హీరోయిన్స్.. చివరికి ఏం చేశారంటే..?
దిశ, సినిమా : ప్రభాస్.. ఈ పేరు వింటేనే సంబరపడిపోయే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఇక అమ్మాయిల్లో అయితే డార్లింగ్‌కు ఉన్న క్రేజే వేరు. ఆ మధ్య కల్కి, సలార్ వంటి సినిమాలతో మరింత అలరించిన ఈ రెబల్ స్టార్‌కు నేటితో సరిగ్గా 44 ఏండ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలు, జీవితానికి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా డార్లింగ్ పుట్టినరోజు నేపథ్యంలో పలువురు అభిమానులు ఆయన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర చర్చకు తెరతీస్తున్నారు. ప్రభాస్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడు? ఆయన ఎవరినైనా ప్రేమించాడా? ఆయనను ప్రేమిస్తున్నవారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఏంటంటే.. ప్రభాస్ ప్రేమలో పడేయడానికి ఎంతో మంది అందమైన హీరోయిన్లు ట్రై చేశారట. అందులో కొందరు ఆయనను ఇప్పటికీ ప్రేమిస్తుండగా.. ఓ ఇద్దరు మాత్రం డార్లింగ్‌ను ఎంతో కాలంగా ప్రేమిన్నా ఆయన పట్టించుకోకపోవడంతో చివరికి తాము మోసపోయామనే బాధలో ఉన్నారట. ఇంతకీ వాళ్లిద్దరూ ఎవరూ అనుకుంటున్నారా? అనుష్క, త్రిష.
అనుష్క ప్రభాస్‌తో కలిసి మిర్చీ, బిల్లా, బాహుబలి, బాహుబలి 2 మూవీస్‌లో నటించగా.. త్రిష పౌర్ణమి, బుజ్జిగాడు, వర్షం సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. వీళ్లిద్దరూ డార్లింగ్‌తో కలిసి నటిస్తు్న్న వేర్వేరు సమయాల్లో అటు ప్రభాస్ అభిమానులు, ఇటు త్రిష, అనుష్క అభిమానులు కూడా ఎవరికి వారు ప్రభాస్‌తో వారి కాంబినేషన్ క్రేజీగా ఉందంటూ తెగ సంబరపడిపోయారు. కొంతమంది ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడగా.. మరికొందరు త్రిష ప్రభాస్ జోడీ బాగుంటుందని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఫైనల్లీ వారు సినిమాల పరంగా నటించడం తప్ప ప్రభాస్ ఎవరూ ఎవరినీ ప్రేమించలేదని తెలిసింది. ఇదిలా ఉంటే.. అనుష్క, త్రిష ప్రభాస్‌ను ప్రేమించారని, అతను ఒప్పుకోకపోవడంతో వారు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా తమ జీవితం నాశంన చేసుకున్నారని కొందరు సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. ఇంకొందరు సినీ లవర్స్ ప్రభాస్‌ను నమ్మి అనుష్క, త్రిష మోసపోయారంటూ గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి డార్లింగ్ బర్త్ డే సందర్భంగా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అభిమానులను అలరిస్తున్నాయి.