'సలార్' విలన్‌గా స్టార్ హీరో.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

by Javid Pasha |   ( Updated:2022-03-09 03:07:44.0  )
సలార్ విలన్‌గా స్టార్ హీరో.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్
X

దిశ, వెబ్‌డేస్క్: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'సలార్'. ఈ సినిమా ప్రారంభం నుంచే హాట్ టాపిక్‌గా ఉంది. మొదట ఇందులో హీరోయిన్ ఎవరనేదానిపై చర్చలు జరిగాయి. దాంతో శ్రుతిహాసన్‌ అని చెప్పి మేకర్స్ ఈ చర్చలను ముగించారు. ఆ తర్వాత నుంచి ఈ సినిమాలో విలన్ గురించి నెట్టింట అనేక వార్తలు వచ్చాయి. ఈ వార్తలు చాలా మంది స్టార్స్ పేర్లు వినిపించాయి. వారిలో మలయాళం స్టార్ పృథ్వీరాజ్ పేరు కూడా వచ్చింది. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు. 'ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ కీ రోల్‌లో కనిపించనున్నాడు' అని ప్రభాస్ చెప్పేశాడు. దీంతో పృథ్వీ ఈ మూవీలో విలన్‌గానే నటించనున్నాడని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ దాదాపు 6 భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో విలన్ ఎవరన్నది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే.

చిరు 154 సెట్స్‌లో స్టార్ హీరోయిన్ హల్‌చల్.. మెగా ట్వీట్ వైరల్



Advertisement

Next Story