- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బాఘీ-4’ సినిమా నుంచి పవర్ ఫుల్ లుక్ రిలీజ్.. థియేటర్స్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff), జాకీ ష్రాఫ్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ‘వర్షం’ మూవీ రీమేక్ ‘బాఘీ’(Baaghi) పేరుతో వచ్చిన సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇందులో శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) హీరోయిన్‌గా నటించగా.. సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా బాఘీ-2(Baaghi-2), బాఘీ-3(Baaghi-3) తెరకెక్కించారు మేకర్స్. ఈ రెండు చిత్రాలు కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాడు. ప్రజెంట్ టైగర్ ష్రాఫ్ ‘బాఘీ-4’ (Baaghi-4) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
దీనికి ఎ. హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నడియావాలా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster)ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) షాకింగ్ లుక్‌తో దర్శనమిచ్చాడు. బాత్‌రూమ్‌లో కత్తి పట్టుకుని రక్తం మరకలతో ఉన్నాడు. అలాగే మందు బాటిల్ చేతిలో పట్టుకుని.. నోట్లో బీడి పెట్టుకుని కనిపించాడు. అయితే ‘బాఘీ-4’(Baaghi-4) మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు.