- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'జోహార్ స్వరాజ్యమ్మ' దద్దరిల్లిన ఎంబీ భవన్.. ఘనంగా నివాళులు
దిశ, ముషీరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యానికి సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. 'జోహార్ స్వరాజ్యమ్మ' నినాదాలతో ఎంబీ భవన్ దద్దరిల్లింది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని ఎంబీ భవన్‌కు తీసుకొచ్చారు. సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పొలిట్ బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కవిత, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ప్రజాపక్షం ఎడిటర్ కె.శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేత మధు యాష్కీ, పాశం యాదగిరి, టీఆర్ఎస్కేవి రాంబాబు యాదవ్ తదితరులు నివాళులర్పించారు. ఉదయం 10 గంటల వరకు స్వరాజ్యమ్మ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఎంబీ భవన్‌లో ఉంచారు. కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఎంబీ భవన్‌కు తరలివచ్చారు. స్వరాజ్యమ్మ పార్థివ దేహాన్ని ఎంబీ భవన్ నుంచి ఐద్వా రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం కాసేపు ఉంచి అక్కడ నుంచి నల్గొండకు తరలించారు.