- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై స్పెషల్ ఫోకస్.. సిటీలో 1.71 లక్షల కేసులు!
దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలను పోలీసులు గుర్తించి ఛలాన్లు, కేసులు నమోదు చేస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరగడంపై గల కారణాలను విశ్లేషించిన పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం వల్లేనని గుర్తించారు. ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండేళ్లో కొన్ని వేల డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా కారణంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం నిలిపివేశారు. ఈ క్రమంలో ఇందులో గుర్తించిన వారికి కూడా శిక్షలు అమలు చేయడం ఆగిపోయాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పెండింగ్‌లో ఉన్న 7వేల కేసులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు లేఖలు రాస్తున్నట్లు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వాహనదారులకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2000 జరిమానా విధిస్తారని తెలిపారు. అయితే, తెలంగాణ ఏర్పడిననాటి నుంచి ఇప్పటి వరకు 1,71,589 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 5,876 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా పట్టుకున్నట్లు ఆయన వివరించారు. అంతేగాకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని గుర్తించేందుకు సిటీలో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.