Amit Shah: మోడీని శివుడితో పోల్చిన అమిత్ షా.. వాళ్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్

by GSrikanth |
PM Modi Endured For 19 Years, Amit shah says after supreme court ruling on Gujarat riots
X

దిశ, వెబ్‌డెస్క్: PM Modi Endured For 19 Years, Amit shah says after supreme court ruling on Gujarat riots| 2002లో జరిగిన అల్లర్ల కేసులో నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేద్ర మోడీకి సిట్ ఇచ్చిన క్లీన్ చీట్‌ను సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై 19 ఏళ్ల పాటు మోడీ మౌనంగా ఎంతో బాధపడ్డారని, ఆ బాధను తాను దగ్గర నుండి కళ్లారా చూశానని అన్నారు. మోడీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా పలు సంస్థలు కలిసి ప్రయత్నం చేశాయని చివరకు అదంతా అబద్ధమని తేలిదన్నారు. సిట్ విచారణను తాము ప్రభావితం చేయలేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు కొనసాగిందని తెలిపారు.

శివుడిలా మోడీ విషాన్ని దిగమింగుకున్నారు:

గుజరాత్ అల్లర్ల కేసులో మోడీపై అనేక మంది బురదజల్లాలని ప్రయత్నాలు చేశారని.. శివుడు తన గొంతులో విషాన్ని దాచుకున్నట్లుగా మోడీ సైతం తన ఆవేదనను అనుభవించారని అమిత్ షా అన్నారు. ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉండటంతో తనపై వచ్చిన ఆరోపణలపై మోడీ ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు. ఎంతో దృఢ సంకల్పం ఉంటేనే అలా నిశ్శబ్ధంగా ఉండటం సాధ్యం అవుతుందన్నారు.

వారంతా క్షమాపణలు చెప్పాలి:

ఈ కేసు విషయంలో మోడీ అనుసరించిన తీరు అందరికీ అనుసరణీయమని అమిత్ షా అన్నారు. రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించాలనే దానికి ప్రధాని మోడీ ఓ చక్కటి ఉదాహరణ అని చెప్పారు. విచారణ సంస్థలు ఆయన్ను ప్రశ్నించినా.. ఎక్కడా ధర్నాలు, ఆందోళనలు చేయలేదని గుర్తుచేశారు. గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీపై ఆరోపణలు చేసిన వారంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed