Ear Piercing: చిన్నపిల్లలకి ఏ ఏజ్‌లో చెవులు కుట్టించాలి.. ఏ రోజు, తేదీ శుభప్రదమైనవి!

by Anjali |
Ear Piercing: చిన్నపిల్లలకి ఏ ఏజ్‌లో చెవులు కుట్టించాలి..  ఏ రోజు, తేదీ శుభప్రదమైనవి!
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్న పిల్లలకు చెవులు కుట్టిస్తే ఎంతో అందంగా, క్యూట్‌గా ఉంటారు. చెవులకు కమ్మలు పెట్టగానే కళ ఉట్టిపడుతుంటుంది. అయితే పిల్లలకు చెవులు కుట్టించడం అనేది తరతరాలుగా వస్తోన్న ఆచారం. బంధువుల్ని ఆహ్వానించి ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఒక పేరెంట్ తమ పిల్లలకు తొందరగా చెవులు కుట్టించాలనుకుంటారు. మరీ ఏ వయస్సులో కుట్టిస్తే మంచిదో తాజాగా నిపుణులు చెబుతున్నారు.

ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరి..

పిల్లలకి 6 నెలలు దాటాక టీకాలు ఏమైనా ఉంటే వేయించాలి. తర్వాత 10 నెలల వయసు దాకా ఆగి.. అప్పుడు పిల్లలకు చెవులు కుట్టించాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. టీకాలు వేసే సమయంలో చెవులు కుట్టించడం వల్ల రోగనిరోధక శక్తి కూడా ఉండదు. సమస్య తీవ్రమవుతుంది. అలాగే చెవులు కుట్టేటప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచుకోవాలి. సరైన గ్లౌజులు ఉపయోగించాలి. కరెక్ట్ ప్లేస్‌లోనే చెవులు కుట్టాలి. లేకపోతే తిమ్మిర్లు వచ్చే చాన్స్ ఉంటుంది.

డాక్టర్స్‌ను అప్రోచ్ అవ్వండి..

చెవులు కుట్టించాక పిల్లల్ని ఎక్కువగా ఆటలు ఆడనివ్వకూడదు. బయటకు కూడా ఎక్కువగా పంపించకండి. పిల్లల ఆరోగ్యం గురించి డాక్టర్స్ కు ఎక్కువగా తెలిసి ఉంటుంది. కాగా చెవులు కుట్టే విషయంలో వైద్యుల్ని అప్రోచ్ అయి.. ఏమైనా సందేహాలు ఉంటే క్లియర్ చేసుకోవచ్చు.

ఏ రోజు మంచిది..

పిల్లలకు సోమ, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారములలో చెవులు కుట్టించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కర్ణ వేధ సంస్కారానికి అమావాస్య తిథిలు, చతుర్థి, నవమి, చతుర్దశి తేదీలు తప్ప.. అన్ని డేట్స్ శుభప్రదమైనవిగా వెల్లడించారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed