- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala Laddu: రోజాకు భార్గవికళ్యాణి స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం (Tirumala laddu controversy)పై తెలంగాణ బీజేవైఎం నాయకురాలు భార్గవికళ్యాణి (Telangana BJYM leader Bhargavikalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఫొటో షూట్ చేసిన రోజా ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. లడ్డూ వివాదంపై మాజీ మంత్రి రోజా (Former Minister Roja) ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. దేవుడి ప్రసాదం తినలేదా అని ప్రశ్నించారు. పవిత్ర లడ్డూలో బీఫ్, ఫిప్ ఆయిల్ కలుపుతారా అని మండిపడ్డారు. పశువులకైనా ఇంగితం ఉంటుందని, వైసీపీ(YCP) వాళ్లకి అది కూడా లేదని విమర్శించారు. హిందూ కల్చర్‌ను నాశనం చేయడానికే వైసీపీ పుట్టిందని ధ్వజమెత్తారు. తిరుమలలాంటి పవిత్ర స్థలాన్ని భ్రష్టు పట్టించారని భార్గవి కల్యాణి మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని (Hindu culture) సర్వ నాశనం చేయడానికి చాలా ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. హిందువునే టీటీడీ చైర్మన్‌గా చేసి తిరుమలలో నికృష్టపు పనులు చేశారని మండిపడ్డారు. ఇటువంటి వాళ్లు మళ్లీ ఓట్ల అడగానికి వస్తే కొట్టండని ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. జగన్ లాంటి వ్యక్తులకు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా ఏపీ ప్రజలు బుద్ది చెప్పాలని భార్గవికళ్యాణి కోరారు.