ఉగాది పచ్చడికి దుర్భర పరిస్థితులు.. చరిత్రలోనే తొలిసారి!

by Satheesh |
ఉగాది పచ్చడికి దుర్భర పరిస్థితులు.. చరిత్రలోనే తొలిసారి!
X

దిశ, తుంగతుర్తి: ఉగాది అంటే టక్కున గుర్తొచ్చేది పచ్చడి. కొత్త చింత పండు, వేప పువ్వు, పెద్ద సైజులో మామిడికాయ, తదితర వాటితో తీపి, చేదుల మధ్య తయారై షడ్రుచులు కలిగించే ఆ పచ్చడి తాగితే.. ఆ మజానే వేరు. అలాంటి ఘనాపాటి చరిత్రను సంతరించుకున్న ఉగాది పచ్చడి నేడు ఆ రుచిని కోల్పోతుంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో లేత చిగుళ్ళతో కొత్త దనాన్ని సొంతం చేసుకునే వేప చెట్లకు క్రిమిసంహారక మందులకు కూడా తగ్గని రోగాలు సోకి చాలా వరకు ఎండిపోయాయి. అంతేకాకుండా మొదట్లో ఆశలు కలిగించిన మామిడి చెట్లకు అనుకూలించని వాతావరణ పరిస్థితులతో పూత చాలావరకు రాలిపోవడం, ఇంకా పిందె దశలోనే కాయ ఉండి.. ఎదగకపోవడం లాంటి పరిస్థితులు ఉగాది పచ్చడి రుచికి అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా గ్రామాల్లో దాదాపుగా ప్రతి ఇంటా వేప పువ్వుతో నిగ నిగలాడాల్సిన వేప చెట్లకు పూత లేకపోవడంతో దాన్ని ఇతరుల ఇండ్లలో వెతకవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగాది ఏనాడు కూడా ఇలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోలేదని పలువురు 'దిశ' కు వివరించారు.

Advertisement

Next Story