Onion Benefits: ఉల్లి దివ్య ఔషధమే.. ఈ కాలంలో తప్పక వాడాల్సిందే..

by GSrikanth |   ( Updated:2022-07-14 10:56:33.0  )
Onion Benefits To Prevent Viral Diseases In Rainy Season
X

దిశ, వెబ్‌డెస్క్: Onion Benefits To Prevent Viral Diseases In Rainy Season| కాలాలు మారుతున్న సమయంలో ఆరోగ్య సమస్యలు రావడం సాధారణం. అయితే వాటిని తగ్గించడానికి సిరప్‌లు, ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఇలా అనేక రకాల మందులు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. కానీ పూర్వకాలంలో జ్వరం, జలుబును తగ్గించడానికి ఇంటి చిట్కాలను ఉపయోగించేవారు. ఉల్లిపాయ ముక్కలను సాక్సులు లేదా క్లాత్‌లో చుట్టి రాత్రి పడుకునే సమయంలో పాదాలకు కట్టుకుని నిద్రపోయేవారు. దీంతో ఉదయం వరకు వారి ఆరోగ్యం చాలా మెరుగు పడేదట. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా.. దీనిని ఇప్పటికే నమ్మే అమ్మమ్మలు ఎంతోమంది ఉన్నారు. అయితే అప్పట్లో ఉల్లిపాయను ఔషధంగా చెప్పుకునేవారు. ఇలా ఉల్లిపాయలతో జ్వరం, జలుబును తగ్గించుకునే ప్రాచీన పద్ధతిని 1500వ శతాబ్ధంలో పాటించేవారు.

ఆ సమయంలో ప్రపంచం ప్రాణాంతకమైన అనేక వ్యాధులతో పోరాడుతుండేది. వాటన్నింటిని నయం చేసే శక్తి ఉల్లిపాయలకు ఉన్నట్లు అప్పటి వైద్యులు సైతం గుర్తించారు. నేషనల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. విషపూరిత గాలులు పీల్చడం ద్వారా వ్యాధులు వ్యాపించేవి. ఆ సమయంలో ఉల్లిపాయను వినియోగిస్తే దాని నుంచి వచ్చే ఘాటైన వాసన గాలిలో కలిసి అందులో విషపూరిత ఇన్ఫెక్షన్‌ను నివారించేది. అందుకే ఉల్లిపాయను ఔషధంగా భావించి జ్వరం, జలుబు చేసిన వారి అరికాళ్ల గోతులో ఉల్లి ముక్కలను ఉంచేవారు. ఇలా పాదాల వద్ద ఉంచడం ద్వారా శరీరంలో అంతర్గత రోగాలు నయం అవుతాయని పూర్వికులు బలంగా నమ్మేవారు. ఉల్లిపాయల్లో సల్ఫర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటమేకాదు.. గొప్ప యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. అందుకే వాటి వల్ల ఆరోగ్యానికి మంచే జరుగుతుందని పలు అధ్యాయనాలు వెల్లడించాయి. కాగా, జ్వరం, జలుబు తగ్గుతాయో లేదో పక్కన పెటితే.. ఉల్లిపాయలు ఫాస్పారిక్ ఆమ్లంను కలిగి ఉంటాయి. ఉల్లిపాయలను మనిషి శరీరానికి తాకేలా ఉంచడం వల్ల వేడి పుట్టి ఫాస్పారిక్ ఆమ్లం విడుదలవుతుంది. ఇది సెమిపెర్మెబుల్ పొర ద్వారా రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంచి.. సిరల గుండా పోయే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సో.. ఉల్లి చేసే మేలు అమ్మ కూడా చేయదు అంటారు మరి.

Also Read: మ‌రో అంతుప‌ట్ట‌ని వ్యాధి.. 13 కేసులు న‌మోదు, ముగ్గ‌రు మృతి

Advertisement

Next Story

Most Viewed