- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమ్మకు ఏమైంది.. ఓలా ప్రకటనపై మండిపడ్డ నెటిజన్లు!
దిశ, ఫీచర్స్ : ప్రతీ కంపెనీ మార్కెటింగ్ జిమ్మిక్స్ ప్లే చేస్తుంటుంది. కానీ ప్రతిసారీ అనుకున్నట్లుగా అవి జనాలకు చేరలేవు. కొద్దిగా మిస్ కన్వే జరిగినా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ 'ఓలా' చేసిన తాజా మార్కెటింగ్ స్టంట్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. 'అమ్మ నుంచి మిస్డ్ కాల్స్' వచ్చాయని తమ కస్టమర్లకు వన్-లైనర్ నోటిఫికేషన్స్ సెండ్ చేసింది. సాధారణంగా కుటుంబ సభ్యుల నుంచి ముఖ్యంగా అమ్మ నుంచి పదే పదే ఫోన్ వచ్చిందంటే తప్పకుండా కంగారు పడతాం. అదే భయాన్ని ఉపయోగించి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో విస్తృతమైన నెగటివ్ కామెంట్స్ అందుకుంటోంది.
ఓలా పంపిన ప్రోమోలో.. 'అమ్మ నుంచి 8 మిస్డ్ కాల్స్', 'పండ్లపై 40 శాతం తగ్గింపు ఉందని ఆమె మీకు చెప్పాలనుకుంది' అనే సారాంశంతో ప్రకటన ఇచ్చింది. దీంతో ఈ మార్కెటింగ్ స్టంట్‌పై ప్రజలు ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఓలాను నిందించారు. ఈ నోటిఫికేషన్ భయాందోళనలకు గురిచేసిందని, ఇటీవలే తల్లులను కోల్పోయిన లేదా ఇంటికి దూరంగా నివసిస్తున్న పిల్లలకు కూడా ఇది ఒక ట్రిగ్గర్ అని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి తల్లుల నుంచి మిస్డ్ కాల్ వచ్చిందంటే ఎంత భయపడతారు, ఒక్కసారి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించమని విమర్శించారు.
ఓలానే కాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రూ.299 నుంచి కిచెన్ అప్లెయెన్స్‌ను పొందవచ్చునని ప్లిప్‌కార్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే మహిళా దినోత‍్సవం రోజున వంట గదికి సంబంధించిన ఆఫర్‌ను మాత్రమే ఎందుకు ప్రకటించారంటూ, వంట గది మాత్రమే మా ప్రపంచం కాదు కదా అని మహిళామణులు మండిపడ్డారు. అంతేకాదు ఇది లింగవివక్షను పెంపొందించే ప్రకటన అని కొందరు కామెంట్స్ చేయడంతో తమ తప్పును తెలుసుకున్న ఫ్లిప్‌కార్ట్.. 'మేము గందరగోళానికి గురయ్యాం. మమ్మల్ని క్షమించండి' అని ట్విట‍్టర్ వేదికగా కోరింది.