Basara Temple: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. భక్తులతో కిక్కిరిసిన బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం

by Shiva |
Basara Temple: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. భక్తులతో కిక్కిరిసిన బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు క్రిస్‌మస్ (Christmas), న్యూ ఇయర్ (New Year) సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కొత్త సంవత్సరంలో తొలి రోజు ఇష్ట దైవాన్ని దర్శించుకుంటే ఏడాది అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో భక్తులంతా ఆలయాలకు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే శ్రీశైలం (Srisailam) భ్రమరాంబం సమేత మల్లికార్జున స్వామి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ నిర్వాహకులు ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను నిలిపివేశారు. అదేవిధంగా నిర్మల్ జిల్లా (Nirmal District) బాసర (Basara)లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతరంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. దీంతో అక్షరాభ్యాస మండపాలు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story

Most Viewed