- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంటర్ పరీక్షలో ఫెయిల్.. మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య
by Mahesh |

X
దిశ, లక్షెట్టిపేట: పట్టణంలోని గోదావరి రోడ్డు కు చెందిన ఇంటర్ విద్యార్థిని పందిరి అశ్విత (17) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సురేష్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు పట్టణంలోని వాగేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోందని, మంగళవారం విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో మృతురాలు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయినందున మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందన్నారు. . మృతురాలి తండ్రి పందిరి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story