- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Raj Nath Singh : ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబిస్తాం : రాజ్ నాథ్ సింగ్

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లోని(Jammu Kashmir) పహల్గామ్(Pahalgoan) లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టుల మీద కాల్పులు(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Raj Nath Singh) తీవ్రంగా ఖండించారు. బుధవారం రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధినేతలతో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.
ప్రపంచం ఆశ్చర్యపోయేలా బదులు ఇస్తామని పేర్కొన్నారు. భారత్ ను ఎవరూ భయపెట్టలేరని తెలిపిన రాజ్ నాథ్ సింగ్.. ఒక్క దోషిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ మూలన దాక్కున్న వెతికి పట్టుకుంటామని తెలిపారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే భారత్ లక్ష్యం అని తెలియజేశారు. మరోవైపు ఉగ్రవాదుల దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ పాక్ రక్షణశాఖ మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు