- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Agnipath scheme: అగ్నిపథ్‌పై అజిత్ డోవల్ సంచలన ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో: No question of rollback of Agnipath scheme, says Ajit Doval| అగ్నిపథ్‌పై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ స్పందించారు. అగ్నిపథ్‌ను రద్దు చేసే ఆలోచనే లేదన్నారు. సైన్యంలో చేపట్టాల్సిన సంస్కరణల్లో భాగంగానే అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మాత్రమే సైన్యంలో సంస్కరణలు సాధ్యమయ్యాయని అన్నారు. దేశ భద్రతకన్న మరేది ముఖ్యం కాదని మోడీ అంటారని గుర్తు చేశారు. 2019 తర్వాత కశ్మీర్ప్రజల ఆలోచన విధానం మారిపోయిందని.. ఇప్పుడిక ఎవరూ తీవ్రవాదం, పాకిస్తాన్‌కు మద్దతు తెలపడం లేదని పేర్కొన్నారు. సైనిక నియామకాలు పూర్తిగా అగ్నిపథ్పథకం ద్వారానే జరగవని స్పష్టం చేశారు. అగ్నివీరులు మాత్రమే సైన్యంలో ఉండరని, నాలుగేళ్ల తర్వాత మళ్లీ సైన్యంలో స్థానం దక్కించుకున్నవాళ్లకు శిక్షణ ఉంటుందని, వాటిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. యువత దేశంపైన, ప్రభుత్వంపైన నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
ఆధునిక ఆయుధాలు అందిస్తే సరిపోదు. సాంకేతికత, వ్యవస్థ, బలగాలు, విధానాలు మొదలైన విషయాల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంస్కరణలు చేపట్టాలి అని అజిత్ డోవల్ అన్నారు. ఈ కాలంలో యుద్ధ విధానమే మారిపోతోందని, కనిపించని శత్రువుతో పోరాడాల్సి వస్తోందని చెప్పారు. టెక్నాలజీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని, రేపటికి సిద్ధంగా ఉండాలి అంటే ఈరోజు మనం మారాల్సిందే అని డోవల్ అభిప్రాయపడ్డారు. దేశంలోని యువతకు ఏదో విధంగా సేవ చేయాలని ఉంటుందని, దేశాన్ని ధృడంగా తయారుచేసే క్రమంలో వారి శక్తి, నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. నిరసనల్లో భాగంగా పలు ప్రాంతాల్లో ఏర్పడిన ఉద్రిక్తతల వెనుక కోచింగ్ సెంటర్లు ఉన్నాయన్న ఆరోపణలపై స్పందించిన డోవల్.. ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే పలువురు నిందితులను గుర్తించి అరెస్టు చేశామన్నారు. తొందరలో ఈ విధ్వంసాల వెనుక ఎవరున్నారో బయటపడుతుందని అన్నారు.