విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదు: కొత్త మార్గదర్శకాలు విడుదల

by Disha Desk |
విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదు: కొత్త మార్గదర్శకాలు విడుదల
X

న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ మేరకు రిస్క్ దేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలను సవరించింది. దేశంలో కరోనా కేసులు తగ్గుతుండడంతో గురువారం నూతన మార్గదర్శకాలను వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చే వారికి ఉన్న 7 రోజుల హోం క్వారంటైన్ తొలగించింది. ఒకవేళ లక్షణాలు ఉంటే 14 రోజులు స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలని కోరింది. ఒకవేళ పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది. ఈ నెల 14 నుంచి నూతన మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. దీని ప్రకారం విదేశాల నుంచి వచ్చే వారు సెల్ఫ్ డిక్లరేషన్ తో పాటు 14 రోజుల ప్రయాణ వివరాలను సువిధ పోర్టల్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రయాణానికి 72 గంటల్లోపు ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ రిపోర్ట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉండగా, బదులుగా రెండు డోసులు తీసుకున్నట్లు సర్టిఫికెట్ సమర్పించాలని పేర్కొంది. నిరంతరంగా మారుతున్న కరోనా వైరస్‌ను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పింది. అయితే ఆర్థిక కార్యకలాపాలను అడ్డంకులు లేకుండా చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా అంగీకరించింది. 'ఎయిర్ లైన్స్ స్వీయ సమాచారం, ఆర్టీపీసీఆర్ టెస్ట్ వివరాలను సమర్పించిన ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తాయని' కేంద్ర ఆరోగ్య మంత్రి పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed