- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఎస్‌యూవీ మోడల్ 'మాగ్నైట్' 50,000వ యూనిట్‌ను విడుదల చేసిన నిస్సాన్ ఇండియా!
చెన్నై: ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా తన ఎస్‌యూవీ మోడల్ మాగ్నైట్ 50,000వ యూనిట్‌ను చెన్నై ప్లాంట్ నుంచి మార్కెట్లోకి విడుదల చేసింది. రెనాల్ట్-నిస్సాన్ సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ కారు దేశీయ, ఎగుమతుల్లో ఇప్పటివరకు లక్షకు పైగా వినియోగదారుల నుంచి బుకింగ్‌లను సాధించిందని కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. నిస్సాన్ సంస్థ గ్లోబల్ మార్కెట్ వ్యూహంలో మాగ్నైట్ ప్రధాన మోడల్‌గా ఉంది. ఇది భారత్‌తో పాటు విదేశాల్లో కంపెనీ ఉనికిని బలోపేతం చేయడంలో, వినియోగదారులను చేరువ చేయడంలో కీలకంగా ఉందని నిస్సాన్ మోటార్ ఇండియా ప్రెసిడెంట్ సినన్ చెప్పారు.
ఈ మోడల్‌ను మొదటగా 2020, డిసెంబర్‌లో తీసుకొచ్చామని, కొవిడ్-19 మహమ్మారి తో పాటు సెమీకండక్టర్ల కొరత లాంటి సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి 50,000వ యూనిట్ మాగ్నైట్ మోడల్‌ను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ వివరించింది. గతేడాది నిస్సాన్ ఈ మోడల్ వాహనాన్ని భారత్ నుంచి దక్షిణాఫ్రికా, ఇండోనేషియా లాంటి దేశాలకు ఎగుమతులు చేయడం ప్రారంభించింది. అంతేకాకుండా నేపాల్, భూటాన్, శ్రీలంక, కెన్యా సహా అనేక దేశాల్లో అందుబాటులో ఉందని కంపెనీ వెల్లడించింది.