Netflix యూజర్స్‌కు బ్యాడ్ న్యూస్..!

by Harish |
Netflix యూజర్స్‌కు బ్యాడ్ న్యూస్..!
X

దిశ,వెబ్‌డెస్క్: వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఖాతా వివరాలను ఇతరులకు షేర్ చేయడానికి అదనంగా డబ్బు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇంతకుముందు నెట్‌ఫ్లిక్స్ వివరాలను ఇతరులకు షేర్ చేయడం సులభంగా ఉండేది. ఓకే ఖాతా వివరాలను వివిధ డివై‌జ్‌లలో ఉపయోగించేవారు. ఇకమీదట అలా కుదరదు. నెట్‌ఫ్లిక్స్ త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఎంపిక చేసిన వారికి మాత్రమే ఖాతా వివరాలను షేర్ చేయవచ్చు. ఓకే పాస్‌వర్డ్, ఖాతాను చాలా డివై‌జ్‌లలో ఉపయోగించడం అరికట్టాలనే ఉద్దేశంతో నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది.

ఎవరైన వేరే డివైజ్‌లో నుండి లాగిన్ కావాలని ప్రయత్నిస్తే, కొత్త ఖాతా వినియోగదారున్ని ఎనెబుల్ చేయడానికి ఖాతా అసలు యజమానికి కోడ్‌తో కూడిన ఈ-మెయిల్ వస్తుంది. ఆ కోడ్ వెరిఫై చేశాకా కొత్త డివైజ్‌లో లాగిన్ కావచ్చు. వినియోగదారులు పాస్‌వర్డ్‌లను బయట వ్యక్తులతో పంచుకోవడానికి అదనంగా $2 నుండి $3 వరకు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. సంస్థ ఇంకా రెండు కొత్త ఫీచర్‌లను పరీక్షిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed