మరోసారి జంటగా దొరికిపోయిన నరేష్-పవిత్ర

by S Gopi |
మరోసారి జంటగా దొరికిపోయిన నరేష్-పవిత్ర
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం టాక్ ఆఫ్ ది తెలుగు సినిమా ఇండస్ట్రీగా మారింది. పవిత్ర-నరేష్ రిలేషన్, పెళ్లితో పాటు నరేష్ మూడో భార్య దాడి వరకు రచ్చ రచ్చగా మారాయి. అయితే ఇలాంటి కథనాలు రోజూ వార్తల్లో వస్తున్నప్పటికీ.. వీరిద్దరు తాజాగా 'అమ్మ నాన్న మధ్యలో మధురవాణి' అనే సినిమా ప్రారంభోత్సవంలో దర్శనమిచ్చి అభిమానులు ఆశ్చర్యపరిచారు. తమపై మీడియా ఇంత ఫోకస్ పెడుతున్నా సరే పట్టించుకోకుండా వీళ్లిద్దరు ఇప్పటికీ జంటగానే అన్ని వేడుకలకు హాజరవుతున్నారు. ఒకవేళ కోర్టు మూడో భార్యకు విడాకులు ఓకే చేస్తే, నరేష్ వెంటనే పవిత్ర లోకేష్‌ను అధికారికంగా నాల్గో మ్యారేజ్ చేసుకుంటాను అని చెబుతుండటం విశేషం.

Advertisement

Next Story