- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss-8: మణికంఠ గుట్టు రట్టు చేసిన నాగార్జున.. షాక్‌లో నెటిజన్లు..!
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 హోరాహోరీగా సాగుతోంది. కంటెస్టెంట్లు అంతా పోటాపోటీగా టాస్కుల్లో పాల్గొంటున్నారు. తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లతో డిఫరెంట్ ఢిఫరెంట్ గేమ్స్ ఆడిస్తున్నారు. స్టార్టింగ్ హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. అందులో ఏడుగురు మంది ఎలిమినేట్ అయ్యారు. దీంతో నాగార్జున ఏకంగా గత సీజన్ల కంటెస్టెంట్లను హౌస్‌లోకి దింపాడు.
వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన రోహిణి, నయన పావని, తేజస్విని, టేస్టీ తేజ, మెహబూబ్, గౌతమ్ కృష్ణ, నటి హరితేజ, ముక్కు అవినాష్, గంగవ్వ ముందు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. టాస్కులన్నీ వేడి వేడిగా సాగుతున్నాయి. ఒకరిని మించి ఒకరు ఆటలో దూసుకుపోతున్నారు. కొందరైతే మైండ్ గేమ్ ఆడుతూ ప్రేక్షకులకే షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే జనాల్లో సింపతీ మ్యాన్ గా పేరు సంపాదించుకున్న మణికంఠ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. హౌస్ లోకి వచ్చిన మొదటి రోజే భార్య, పాప కావాలి అంటూ తన ఫ్యామిలీ గురించి చెబుతూ నెటిజన్లకు కన్నీళ్లు పెట్టించాడు.
ప్రతి చిన్న విషయానికి ఏడ్చే మణికంఠ ఇప్పుడు మారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు నాగ్ తాజాగా హౌస్‌లోని కంటెస్టెంట్లందరికి చూపించి.. మెచ్చుకున్నారు. రాయల్స్, ఓజీ కలిసి ఆడిన టాస్క్‌లో మణికంఠ కీపర్‌గా పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆటలో భాగంగా మణి దొంగతనం చేస్తాడు. మళ్లీ వెంటనే వారి వస్తువులు వారికి ఇచ్చేస్తాడు. గంగవ్వ, అవినాష్, రోహిణి చుట్టూ తిరుగుతూ బాగా ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాడు.
ఓ సందర్భంలో రోహిణిని ఫ్లర్ట్ చేసే వీడియో కూడా నాగ్ బయటపెడతారు. దీంతో అంతా షాక్ అవుతారు. ఫ్లర్ట్ చేసి లాస్ట్ కు అక్క అన్నాడు అంటూ నాగ్‌తో చెబుతూ రోహిణి తెగ ఫీల్ అయిపోతుంది. మణికంఠ జోష్ పెరిగిందంటూ.. జోక్స్, అతడు పాడిన పాటలు, గెస్టులను ఎంటర్‌టైన్ చేసే విధానం మొత్తం నాగ్‌కు బాగా నచ్చుతుంది. ఇకపై ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలంటూ మణికంఠకు నాగార్జున ధైర్యం చెప్పి.. ప్రశంసలు కురిపిస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.