Thank You Movie: అభిమానులకు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో "థాంక్యూ"

by GSrikanth |   ( Updated:2022-07-16 09:17:47.0  )
Naga Chaitanya
X

దిశ, వెబ్‌డెస్క్: Naga Chaitanya's Thank You Movie Pre Release Event at Vizag Today| నాగచైతన్య హీరోగా.. మనం ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న సినిమా 'థాంక్యూ'. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీ అయింది. ఈ క్రమంలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను.. ఈ రోజు సాయంత్రం వైజాగ్‌లో నిర్వహించనున్నారు. ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించి డేట్.. టైమ్ ఫిక్స్ చేసి పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఆంధ్ర యూనివవర్సిటీ లోని సీఆర్ రెడ్డి కన్వెషన్ హాల్‌లో గ్రాండ్‌గా వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొంత సేపటి క్రితమే అధికారికంగా అనౌన్స్ చేశారు. ''ప్రతి ఒక్కరి జీవితం ఒక ప్రయాణం లాంటిదే. ఆ ప్రయాణంలో చాలా మంది తారసపడుతుంటారు. కొత్తవారి పరిచయాలు, సరికొత్త జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులు కలబోసిన సినిమా థ్యాంక్యూ. తమ జీవితంలో ఇలా కలిసినవారందరికి థాంక్స్ చెప్పడమనే కంటెంట్‌తో రూపొందించిన''.. థాంక్యూ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి: పాన్ ఇండియా స్టార్ కావాలనే ఆలోచన లేదు.. మహానటి

Advertisement

Next Story