Thank You Movie: నిఖిల్‌కి పోటీగా నాగచైతన్య 'థ్యాంకూ'

by Manoj |   ( Updated:2022-06-25 08:05:00.0  )
Naga chaitanya, Raashi Kanna
X

దిశ, వెబ్‌డెస్క్: Naga chaitanya, Raashi Kanna's Thank you movie is Postponed to July 22| అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం 'థ్యాంకూ' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. అయితే, ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని జూలై 8న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. తాజాగా, రిలీజ్ డేట్‌ను మారుస్తునట్టు ప్రకటించారు చిత్రబృందం.

ఈ సినిమాను జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు నిర్మాతలు దిల్‌రాజు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. 'అభిమానులు అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ కొత్త డేట్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరోవైపు యంగ్ హీరో నిఖిల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న కార్తికేయ-2 సినిమాను కూడా జులై 22న విడుదల చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. మరి స్క్రీన్‌పై ఈ యంగ్ హీరోల పోటీ ఎలాంటి ఉంటుందో చూడాలి.

Advertisement

Next Story