- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mukhtar Abbas Naqvi: నా రాజకీయ జీవితం ఇంకా ముగియలే: మాజీ కేంద్రమంత్రి నఖ్వీ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: My Political and Social Tenure not yet Over, Says Mukhtar Abbas Naqvi| బీజేపీ కీలక నేత, మాజీ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కేబినెట్మంత్రి పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే, ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నఖ్వీ పదవికాలం ఇటీవలే ముగిసింది. ప్రభుత్వం నఖ్వీని మరోసారి రాజ్యసభకు ఎంపిక చేయకపోవడంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రాజ్యసభలో నా పదవీకాలం పూర్తయిందని నేను అర్థం చేసుకున్నాను.. నేను అంకితభావంతో, సమాజం పట్ల శ్రద్ధతో పని చేస్తాను," అని పేర్కొన్నారు. అయితే, నఖ్వీను రాజ్యసభకు బీజేపీ ప్రణాళిక ప్రకారమే పంపించలేదని.. ఆయనను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపనుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పదవి కాలం ఆగస్టులో ముగుస్తుండటంతో.. నఖ్వీని ఉపరాష్ట్రపతి రేసులో బరిలో దించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతున్న తరుణంలో నఖ్వీ చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు బలం చేకూర్చిలా ఉన్నాయి.