- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ.. పుకార్లపై ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన గ్రామస్తులు.. విచారణలో ఏం తేలిందంటే?
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఆదివారం రాత్రి జంతు కళేబరాలను తరలిస్తున్న ఓ వాహనం డ్రైవర్‌పై గ్రామస్తులు దారుణంగా దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటుగా వెళ్తున్న ఓ వాహనాన్ని గ్రామస్తులు ఆపారు. గొడ్డు మాంసం రవాణా చేస్తున్నాడని మరియు ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడనే అనుమానంతో వాహనం డ్రైవర్ అయినటువంటి ముస్లిం వ్యక్తిపై తీవ్రంగా దాడి చేశారు. అయితే, జంతువుల కళేబరాలను పారవేసేందుకు గ్రామ పరిశుభ్రత డ్రైవ్‌లో భాగంగా ఆ వాహనం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
'దాడి చేస్తున్న సమయంలో బాధితుడు తనను కొట్టొద్దంటూ వేడుకున్నాడు. అయినా కూడా వాళ్లు ఏ మాత్రం కరుణ చూపకుండా తీవ్రంగా కొట్టారు. ఓ వ్యక్తి జోక్యం చేసుకుని దాడిని ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని పక్కకు నెట్టి దాడి చేశారు. మధురలోని గోవర్ధన్ ప్రాంతానికి చెందిన రామేశ్వర్ వాల్మీకి జంతు కళేబరాలను పారవేసేందుకు జిల్లా పంచాయతీ నుండి లైసెన్స్ కలిగి ఉన్నాడని మేము కనుగొన్నాం. మా ప్రాథమిక విచారణలో ఆవులు లేదా ఆవుల మాంసం వాహనంలో కనబడలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం' అని పోలీసులు తెలిపారు.