పట్టపగలే చోరీ…

by Kalyani |
పట్టపగలే చోరీ…
X

దిశ, హనుమకొండ : హనుమకొండ నగరం పెద్దమ్మ గడ్డ సమీపంలోని కేసర్ గార్డెన్ రోడ్ నెంబర్ 5 లో ఘరానా దొంగలు కొత్తగా నిర్మాణంలో ఉన్న గృహాలను టార్గెట్ చేస్తూ ఇంటి యజమాని లేని సమయంలో వచ్చి ఎలక్ట్రిషన్, ప్లంబర్ వర్కర్లమని చెప్పి నూతన ఇంటిలో పని చేస్తున్న బీహార్ వాళ్ళని నమ్మించి విలువైన సామాగ్రిని పట్టపగలే చోరీ చేశారు. సుమారు రూ. 30 నుండి నలభై వేల రూపాయల విలువ చేసే ఎలక్ట్రికల్, ప్లంబింగ్ కు సంబంధించిన సామాగ్రిని తీసుకొని వెళ్ళారు. ఇలా బీహార్ వాళ్ళు నిర్మిస్తున్న నూతన గృహాలను టార్గెట్ చేసి పట్టపగలే యువకులు చోరీ చేస్తూ దర్జాగా తిరుగుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరూ వచ్చినా నమ్మకూడదు అని కాలని వసూలు అంటున్నారు. ఇలాంటి వారిని గుర్తించి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story