Balakrishna: ‘డాకు మహారాజ్’ మాస్ ధమాకా వచ్చేస్తుంది.. ఇంకా దబిడి దిబిడే అంటూ హైప్ పెంచుతున్న ట్వీట్

by Hamsa |
Balakrishna: ‘డాకు మహారాజ్’ మాస్ ధమాకా వచ్చేస్తుంది.. ఇంకా దబిడి దిబిడే అంటూ హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(DaakuMaharaaj ). బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో రాబోతున్నట ఆ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Naga Vamsi ), సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ‘డాకు మహారాజ్’ నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ అంచనాలు మరింత పెంచుతున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన థర్డ్ సింగిల్(Third single) రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘కొత్త సంవత్సరంలో మాస్ ధమాకా రాబోతుంది. ‘డాకు మహారాజ్’ థర్డ్ సింగిల్ జనవరి 4న యూఎస్‌లో 5వ తేదీన ఇండియాలో విడుదల కాబోతుంది. ఇంకా దబిడి దిబిడే’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా బాలయ్య, బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) మాస్ స్టెప్ వేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.

Advertisement

Next Story

Most Viewed