- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాలువలు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లందించాలి : ఎమ్మెల్యే
దిశ,దుబ్బాక : కాలువలు పూర్తి చేసి చెరువు, కుంటలకు, పంట పొలాలకు సాగునీరు విడుదల చేయలేని పక్షంలో హైదరాబాద్ కు మల్లన్న సాగర్ నుంచి తరలించే నీటిని వేలాది మంది రైతులతో కలిసి అడ్డుకుంటామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం దుబ్బాక మండలంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు లోని దుబ్బాక ప్రధాన కాలువ పనులు అసంపూర్తిగా నిలిచిపోగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎమ్మెల్యే గా గెలవగానే ఏడాది నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ల నుండి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా భూసేకరణ చేసి, కోర్టు కేసులు పరిష్కరించి పిల్లకాలువలు పూర్తి చేయాలని, ప్రభుత్వం కు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అసెంబ్లీ లో సైతం దుబ్బాక నియోజకవర్గ సమస్యలపై మాట్లాడినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.
మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో కాలువల నిర్మాణం పక్కన పెట్టి హైదరాబాద్ కు నీళ్లు తీసుకోవడానికి పనులు చేపడుతున్నారని, వీరికి రైతుల మీద ఏ పాటి ప్రేమ ఉందొ అర్థమవుతుందన్నారు. దుబ్బాక ప్రధాన కాలువకు సంబంధించి శివాజీ నగర్, అచ్చుమాయపల్లి, కమ్మర్ పల్లి, ఆరెపల్లి, పోతారం, కమ్మర్ పల్లి, గంభీర్ పూర్, రఘోత్తం పల్లి తదితర గ్రామాలకు వెళ్లే కాలువ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాన్నారు.ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, జనవరి 1 నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగిందన్నారు.
ఈ ఏడు వర్షాభావ పరిస్థితి ఏర్పడటంతో యాసంగి సాగు ప్రశ్నర్ధకంగా మారిందన్నారు. యాసంగి కి సాగునీళ్లు విడుదల చేయకపోతే పంట పొలాలు ఎండి పోవడం ఖాయమన్నారు. ఒక్క గుంట పొలం ఎండినా అది ప్రభుత్వ వైఫల్యం అవుతుందని, ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో గతంలో నిర్మించిన కాలువలు పిచ్చి గడ్డి, మొక్కలతో, పూడికతో నిండిపోయిందని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి, రైతుల హితమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.