Pushpa 2: నోటీసులపై సంధ్య థియేటర్ యాజమాన్యం సమాధానం.. కీలక విషయాలతో కూడిన లేఖ

by Ramesh Goud |
Pushpa 2: నోటీసులపై సంధ్య థియేటర్ యాజమాన్యం సమాధానం.. కీలక విషయాలతో కూడిన లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theatre Stampade) ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురికి పోలీసులు(Telangana Police) షోకాజ్ నోటీసులు(Notices) జారీ చేశారు. ఈ నోటీసులపై సంధ్య థియేటర్ యాజమాన్యం(Sandhya Theatre management) ఆదివారం సమాధానం ఇచ్చింది. ఈ మేరకు ఆరు పేజీలతో కూడా సమాధాన లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు అందజేసింది. ఇందులో తొక్కిసలాట ఘటనలో తమపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చింది. సంధ్య థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయని నోటీసులలో పేర్కొంది. 'పుష్ప 2' ప్రీమియర్ షో(Pushpa-2 Premier Show) సందర్భంగా 4, 5 తేదీల్లో థియేటర్‌ను మైత్రీ మూవీస్(Mytri Movies) ఎంగేజ్ చేసుకున్నదని తెలిపింది. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని వివరించింది. అంతేగాక గతంలో కూడా చాలా సినిమాల రిలీజ్‌కి హీరోలు సంధ్య థియేటర్‌కు వచ్చేవారని, ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని తెలిపింది. ఇక థియేటర్‌కు టూ, ఫోర్ వీల్ ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఉందని వెల్లడించింది. అంతేగాక ఈ ఘటనలో పలు కీలక విషయాలు లేఖ ద్వారా పోలీసులకు థియేటర్ యాజమాన్యం తెలియజేసింది.

Advertisement

Next Story

Most Viewed