డిజిటల్ కంటెంట్ తో మెరుగైన బోధన.. కలెక్టర్ రాజర్షి షా

by Sumithra |
డిజిటల్ కంటెంట్ తో మెరుగైన బోధన.. కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, ఆదిలాబాద్ : ప్రభుత్వ విద్యా కేంద్రాల్లోను డిజిటల్ మధ్యమాలు అందుబాటులోకి వచ్చాయని, వాటితో బోధన చేస్తే అభ్యసన సామర్ధ్యాలు మెరుగౌతాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపకరించేలా జైనథ్ మోడల్ స్కూల్, కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు గోస్కుల సత్యనారాయణ రూపొందించిన ఉచిత డిజిటల్ కంటెంట్ ను ఆయన ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన అధ్యాయాలను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్, కేజీబీవీ విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియంలో రూపొందించిన కంటెంట్ తో ఇటు బోర్డు పరీక్షలతో పాటు అటు నీట్ లాంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా తయారు చేసినట్లు సత్యనారాయణ తెలిపారు. సీడీ, లింక్, క్యూ ఆర్ కోడ్ ద్వారా ఉచితంగా ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, కేజీబీవీ జిల్లా ప్రత్యేక అధికారి ఉదయశ్రీ, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఆరోగ్య పాఠశాల సంధానకర్త అజయ్, ప్రిన్సిపాల్ లుందే రాము పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed